అమెరికాకు తప్పిన ‘ఫిస్కల్‌ క్లిఫ్‌ ‘ గండం

వాషింగ్లన్‌ : అమెరికాలో ఫిస్కల్‌ క్లిఫ్‌ గండం నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశించిన బిల్లు ప్రతినిధుల సభ ఆమోదం లభించింది. 257-167 ఓట్లతో బిల్లుకు సభ్యులు మద్దతు తెలిపారు. వాటంతట అవే అమల్లోకి వచ్చే పన్నుల పెంపు, భారీ స్థాయిలో వ్యయాలలో కోతల నుంచి తప్పించుకోవాడానికి ఈ బిల్లును ప్రతిపాదించారు. ఈ బిల్లుకు మంగళవారం ఆమెరికా సెనేట్‌ ఆమోదం లభించింది. అధ్యక్షుడు సంతకం చేసి తర్వాత బిల్లుకు చట్టరూపం వస్తుంది.