అమెరికా పర్యటనలో మోదీ
` అధ్యక్షుడు జోబైడెన్‌తో కీలక భేటీ
` వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతంపై సమీక్షిస్తాం
` ట్విట్టర్‌లో వెల్లడిరచిన ప్రధాని
న్యూఢల్లీి,సెప్టెంబరు 22(జనంసాక్షి): కరోనా సంక్షోభం గట్టెక్కుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన తన ట్విట్టర్‌లో ఇవాళ అమెరికా టూర్ గురించి పోస్టు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు తాను ఆ దేశానికి వెళ్తున్నట్లు వెల్లడిరచారు. రెండు దేశాల మధ్య సమగ్రమైన వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి సవిూక్షించనున్నట్లు మోదీ తెలిపారు. అమెరికా పర్యటన ద్వారా వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయనున్నట్లు తన ట్వీట్‌లో చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తోనూ ఆయన భేటీకానున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రెండు దేశాల మధ్య సహకారంపై ఆమెతో చర్చించనున్నారు. క్వాడ్ నేతల సదస్సులోనూ పాల్గొననున్నట్లు మోదీ తెలిపారు. అధ్యక్షుడు బైడెన్, ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని మోషిహిడే సుగాలతో మోదీ భేటీ అవుతారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు స్కాట్ మారిసన్, సుగాలతో వ్యక్తిగతంగా సమావేశం కానున్నట్లు ఆయన చెప్పారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రసంగించనున్నట్లు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు అమెరికాకు పయనమైనట్లు వెల్లడిరచారు. పలు అంతర్జాతీయ సమస్యలపై ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌తో కూడా చర్చించనున్నట్లు చెప్పారు.కోవిడ్19, ఉగ్రవాదం, వాతావరణ మార్పులు లాంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. కరోనాతో ప్రపంచం అంతా అల్లాడిన అనంతరం మెల్లగా కోలుకుంటున్న తరుణంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడనుంది.