అమెరికా స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్ లో మంథని త్రీడీ కళాకారుడు

జనంసాక్షి, మంథని : అమెరికాలోని డౌన్ టౌన్ మిన్నియా పాలిస్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగుతున్న స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్ లో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన త్రీడీ కళాకారుడు శివ రామకృష్ణ పాల్గొన్నారు. నిర్వాహకుల నుంచి అందిన ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లిన శివ రామకృష్ణ అమెరికన్ త్రీడీ ఆర్టిస్ట్ షాన్ తో కలిసి శుక్రవారం వేర్ హౌస్ డిస్ట్రిక్ట్ లైవ్ అనే ఈవెంట్ కు అనుగుణంగా త్రీడీ ఆర్ట్ వేశారు. ఆదివారం సాయంత్రం వరకు జరిగే డౌన్ టౌన్ మిన్నియా పాలిస్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్ లో మరిన్ని అద్భుతమైన త్రీడీ చిత్రాలు వేయనున్నట్లు శివ రామకృష్ణ తెలిపారు. ఈ ఫెస్టివల్ లో దాదాపు 40 మంది అంతర్జాతీయ ఆర్టిస్టులు పాల్గొంటుండగా, ఇందులో కేవలం ఇద్దరే త్రీడి ఆర్టిస్టులు పాల్గొన్నారని తెలిపారు. అందులో ఒకరు భారతదేశానికి చెందిన శివ రామకృష్ణ కావడం విశేషం. షాన్ తో కలిసి తాను వేసిన త్రీడీ ఆర్ట్ ని చూసి, అమెరికా ప్రజలు ఎంతగానో ప్రశంసించారని శివ రామకృష్ణ తెలిపాడు. తమ ఈవెంట్ కు త్రీడీ ఆర్ట్ చేయమని తనను భారత్ నుంచి ఆహ్వానించి, కళలకి, కళాకారులకు ఎంతగానో విలువనిస్తున్న, ఫెస్టివల్ డైరెక్టర్ లీసాకి, తన సహ ఆర్టిస్ట్ షాన్ కి కృష్ణ ధన్యవాదాలు తెలిపారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, అమెరికాలో త్రీడీ ఆర్ట్ చేయడం ఒక గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు.

తాజావార్తలు