అమ్మహస్తాన్ని ప్రారంభించిన సీఎం కిరణ్‌కుమార్
భీమదేవరపల్లి, జనంసాక్షి: కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లిలో అమ్మహస్తం పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ ప్రణాళికకు రూపకల్పన చేశామన్నారు. దేశంలోనే ఇటువంటి ప్రణాళిక ఇదే ప్రథమమని ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగేలా ఈ నిధులను వ్యయంచేస్తామన్నారు. అనంతరం పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.