*అయ్యప్పల్లి సర్పంచ్ ఇంట్లో దొంగతనం!
నగదు,బంగారు అభరణాలు అపహరణ!
_________
లింగంపేట్ 23ఆగస్టు (జనంసాక్షి)
బంగారి అభర్ణాలు,నగదు అపహరించి దొంగతనానికి పాల్పడ్డ ఘటన లింగంపేట్ మండలంలోని అయ్యపల్లి గ్రామంలో చేటు చేసుకుందని లింగంపేట్ ఎస్ఐ శంఖర్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి.మండలంలోని అయ్యపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ శివ్వమ్మ ఇంట్లో దొంగలు పడి 14 వేల రూపాయలు 1 తులం బంగారం దొంగలు అపహరించారని ఆయన తెలిపారు.వివరాలు ఈ విదంగా ఉన్నాయి.సర్పంచ్ కుమారుడు శంకరప్ప అల్లున్ని అమెరికాకు ఆదివారం ఫ్లైట్ ఎక్కించడానికి హైదరాబాద్ వెళ్లారు.వారు అదేరోజు సాయంత్రం అయ్యపల్లి గ్రామానికి తిరిగి వచ్చేసరికి సర్పంచి శివ్వమ్మ ఇల్లును దొంగలు ఆదివారం రాత్రి 11 గంటలకు దొంగలించి 14 వేల రూపాయలు,తులం బంగారం దోచు కెళ్లారని సర్పంచ్ కుమారుడు శంకరప్ప తెలిపారు.ఆదివారం రాత్రి 11 గంటలకు సర్పంచ్ కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చే సరికి వేసిన తలుపులు వేసినట్టే ఉంచి ఇంటి పై నుంచి వచ్చిన దొంగలు గడ్డపారతో ఇంటి పై కప్పను పగల గోట్టి ఈ ఘటనకు పాల్పడ్డారని ఎస్సై పేర్కొన్నారు.సంఘటన స్థలానికి క్లూస్ టీం వచ్చి వేలు ముద్రలు సేకరించారని తెలిపారు.ఇట్టి విషయంలో సర్పంచ్ కుమారుడు శంకరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.