అరబిందో పాఠశాలలో బతుకమ్మ సంబరాలు
జనగామ , సెప్టెంబర్ 24,( జనంసాక్షి ) :
జిల్లా కేంద్రంలోని అరబిందో ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో వివిధ రంగు ల పూలతో బతుకమ్మలు పేర్చి విద్యార్థినిలు ఉపా ధ్యాయినీలు కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆట ఆడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సి పాల్ ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం వాసుదే వ రెడ్డి, రాజిరెడ్డి, సరిత, పద్మావతి, కిరణ్మయి, రమ్య, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.