అరిజోనాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి
న్యూ మెక్సికో,ఆగస్ట్31(జనం సాక్షి): న్యూమెక్సికోలోని అరిజోనా సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సెవిూ ట్రక్ టైర్ పగలడంతో అదుపుతప్పి మరొక బస్సును ఢీ కొట్టిన ఘటనలో ఏడుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యినట్లు అధికారులు తెలిపారు. న్యూమెక్సికో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెవిూ ట్రక్కు టైర్ పగిలడంతో ఫోనిక్స్ వెళుతున్న గ్రే¬ండ్‌కు చెందిన బస్సును ఢీ కొట్టిందన్నారు. జాతీయ రవాణా రక్షణ మండలి, న్యూ మెక్సికో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.