అర్హులందరికి ఇళ్లు : ఎమ్మెల్యే పాయం

భద్రాద్రి కొత్తగూడెం,జూలై2(జ‌నం సాక్షి): ఇచ్చిన హావిూ మేరకు పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. అనేక ప్రాంతాల్లో నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని అన్నారు. కెసిఆర్‌ సంకల్పంతో ఈ ఇళ్లు పేదలకు వరంలా మారాయని అన్నారు.పేదలు సరైన ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, వాటిని చూసిన సీఎం కేసీఆర్‌ డబుల్‌ ఇండ్లకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారన్నారు. నియోజకవర్గంలో డబుల్‌ బెడ్‌ రూం ఇడ్ల నిర్మాణాలు ఎంతో అందంగా నిర్మితమవుతున్నాయన్నారు. సొంతంగా కట్టుకున్నా ఇంత బాగా నిర్మించుకోని విధంగా పనులు జరుగుతున్నాయన్నారు. దీనికి లబ్ధిదారులు ఎంతో సంతోషిస్తున్నారన్నారు. అర్హులైన పేదలందరికి ఇళ్లు అందేలా చూస్తామని అన్నారు. ఇదిలావుంటే ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయటమే కాకుండా పంట పండించే రైతుకు బీమా సౌకర్యం కల్పించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు బాంధవుడని అనుకున్నదే తడువుగా రైతు బీమా పథకంను అమలు చేస్తూ ప్రభుత్వం సొంతంగా నగదు చెల్లించి ప్రతి రైతుకు బీమా సౌకర్యం కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల పేరుతో భీమా సైకర్యం కల్పిస్తూ రూ. 5 లక్షలు బీమా పొందే విధంగా చర్యలు తీసుకున్నదని అందుకు అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి రైతులకు ఆసరాగా నిలిచిందని అన్నారు.