అర్హులైన నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు అందజేత – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

 హుజూర్ నగర్ మార్చి 3 (జనంసాక్షి): అర్హులైన నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలను హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేతులమీదుగా అందజేశారు. శుక్రవారం ఈ సందర్బంగా శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఉచితంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా రెగ్యులర్ చేసి ఇండ్ల పట్టాలను అందజేయుటకు ముఖ్య కారణం ముఖ్యమంత్రి కెసిఆర్ నని అన్నారు. పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కెసిఆర్ 2014 జూన్ కంటే ముందు నుండు ఉన్న నిజమైన అర్హులకు 58 జి. ఓ క్రింద 9 మందికి ఇండ్ల పట్టాలు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. పారదర్శకంగా తమ విధులను నిర్వహిస్తున్న రెవెన్యూ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ముడెం గోపిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, ఆర్డిఓ వెంకారెడ్డి, ఇంచార్జి తాసిల్దార్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.