అర్హులైన నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి
కారుకురి నగేష్
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు
జనంసాక్షి దండేపల్లి 27 భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దండేపెల్లి మండల సమితి ఆధ్వర్యంలో మంగళవారం అర్హులైనటువంటి పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంచిర్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు కారుకురి నగేష్ AIYF జిల్లా కార్యదర్శి లింగం రవి మాట్లాడుతూ…
మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎనిమిది సంవత్సరాల కాలంలో మంచిర్యాల జిల్లాలలో ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో అర్హులైనటువంటి లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందించలేనటువంటి దుర్భర పరిస్థితులలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఆనాడు తెలంగాణ వస్తే మన నిధులు నియామకాలు మన నీళ్లు అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని భావిస్తుంది ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఇయాల లక్షల కోట్ల అప్పుల కూరుకుపోయి తెలంగాణ ప్రజలని పేద బడుగు వర్గాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్ర తో వ్యవహరిస్తోంది ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పునటువంటి హామీలను నిలబెట్టుకోకపోగా కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మభ్య పెడుతున్నాడు ఈరోజు దండేపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ ముందు అర్హులైనటువంటి పేదలకు బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే ఇవ్వాలని లేని పక్షంలో టిఆర్ఎస్ పార్టీ కి ఇక్కడి నుండి పతనం మొదలు అవుతుందని భారత కమ్యూనిస్టుగా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో. పాల్గొన్న వారు, , దండేపల్లి CPI మండల కార్యదర్శి పెరక రాజేశం,
cpi జిల్లా సమితి సభ్యులు, మెదరి దేవవరం,
మిట్టపెల్లి పౌల్,
దేవి పొశం,
చాడా మహేందర్ రెడ్డి, నాయకులు భాను చందర్
, సెనిగారపు నర్సక్క, j. విజయ, లింగవ్వ,ముత్తక్క, రాజవ్వ.తదితరులు పాల్గొన్నారు.