అల్వాల్‌లో యువకుడిని అపహరించిన గుర్తుతెలియని వ్యక్తులు
హైదరాబాద్: అల్వాల్‌లో కార్తీక్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు పోలీసులమని చెప్పి కార్తీక్‌ని తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.