అవినీతికి దూరంగా మోడీ ప్రభుత్వం

అత్యున్నత న్యాయస్తానంలో ఇండో అమెరికన్‌

నియోమి రావు నియామకానికి ట్రంప్‌ ఓకే

వాషింగ్టన్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): అమెరికా సుప్రీం కోర్టు తర్వాత అత్యంత శక్తివంతమైన కోర్టుగా పరిగణించే డిసి సర్క్యూట్‌ అప్పీళ్ళ కోర్టు న్యాయమూర్తిగా బ్రెట్‌ కవానా స్థానంలో ప్రముఖ ఇండియన్‌ అమెరికన్‌ న్యాయవాది నియోమి రావును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ చేశారు.

వైట్‌హౌస్‌లో మంగళవారం దీపావళి సంబరాల్లో పాల్గన్న ట్రంప్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. సెనెట్‌ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తే, ప్రస్తుతం సమాచార, క్రమబద్ధీకరణ వ్యవహారాల కార్యాలయం (ఓఐఆర్‌ఎ) అడ్మినిస్టేట్రర్‌గా వున్న నియోమి రావు ఈ స్థాయిలో నియమితులైన రెండవ ఇండియన్‌ అమెరికన్‌ న్యాయమూర్తి కానున్నారు. గతంలో ఒబామా హయాంలో మొదటగా శ్రీ శ్రీనివాసన్‌ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆమె చాలా అద్భుతమైన వ్యక్తని ట్రంప్‌ నియోమి రావును ప్రశంసించారు. అప్పీళ్ళ కోర్టులో 12ఏళ్ళ పాటు సేవలందించిన కవానా ఖాళీ చేసిన స్థానంలో రావు బాధ్యతలు స్వీకరిస్తారు. తనపై ఇంత విశ్వాసముంచినందుకు ఆమె ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. యాలె యూనివర్శిటీ విద్యార్ధి అయిన రావు ప్రైవేటు రంగంలో కూడా పనిచేశారు. భారత్‌కు చెందిన పార్శీ దంపతులకు జన్మించిన నియోమి రావు మిచిగన్‌లో పెరిగారు