అవినీతి నిర్మాలనకు మీ సేవ చక్కని మార్గం : ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: నిర్ణీత కాలవ్యవధిలో ప్రభుత్వ సేవలకు సామాన్యులకు అందించేందుకు ప్రభుత్వం సేవాహక్కు చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈ చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈ చట్టం ద్వారా పౌరులకు ఉత్తమ సేవలు అందుతాయని చెప్పారు. నిర్లక్ష్యం వహించే అధికారులే దరఖాస్తుదారునికి జరిమానా చెల్లించే విధంగా నిబంధనలు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. జూబ్లీహాల్‌లో సాంకేతిక శాఖ నిర్వహించిన మీ సేవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మీ సేవ పరిధిలో కొత్తగా 16 సేవలను ప్రారంభించారు. మీ సేవ ద్వారా మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు  ఆదర్శంగా నిలిచిందని తెలియజేశారు.  మార్చి నాటికి మీ సేవ పరిధిలోకి 100 సేవల్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అవినీతి నిర్మాలనకు మీ సేవ చక్కని మార్గమని పేర్కోన్నారు. అనంతరం మీ సేవ లబ్విదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు.