అవినీతి పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి

The Prime Minister, Shri Narendra Modi addressing the public meeting, in Solapur, Maharashtra on January 09, 2019.

– ఆ పార్టీలు దేశంలోని ప్రజాస్వామ్యాన్ని అవినీతిమయం చేస్తాయి
– ప్రతికూల శక్తులకు ఐక్యంగా గుణపాఠం చెప్పండి
– నేను ఎప్పటికీ విూ కాపలాదారుడినే
– పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేవరకు కృషిచేస్తా
– చత్తీష్‌గఢ్‌ సభలో ప్రధాని నరేంద్ర మోడీ
రాయ్‌గఢ్‌, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి) : దేశంలోని అనివీని పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సిద్ధమవుతున్నాయని, అది వారితరం కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. అవినీతికి పాల్పడడమే కాంగ్రెస్‌ పార్టీ అజెండా అని మోదీ విమర్శించారు. అవినీతికి పాల్పడ్డవారికి ఆ పార్టీ సాయం చేస్తోందని ఆయన అన్నారు. ‘ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వబోమని అంటోందని, అలాగే, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్యారోగ్య పథకాలు ఈ రాష్ట్రానికి వద్దని చెబుతోందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేంకూడా వారికి అభినందనలు తెలిపామన్నారు. రాష్ట్రాభివృద్ధికోసం వారుకూడా కొన్ని మంచి పనులు చేస్తారని అనుకున్నామన్నారు. కానీ, కేంద్ర సర్కారు అందిస్తున్న పథకాల ప్రయోజనాలు అందకుండా చేయడమే వారి పనిగా మారిందని మోదీ విమర్శించారు. ‘నేను వారిని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నానని.. విూకు ఉన్న సమస్య ఏంటి..? పేద ప్రజలు నాకు మద్దతు తెలుపుతున్నారని కాంగ్రెస్‌కి తెలుసు.. అందుకే, వారు ఇటువంటి పనులు చేస్తున్నారని మోదీ అన్నారు. కాంగ్రెస్‌కి ఓ విషయాన్ని గుర్తు చేయాలని అనుకుంటున్నానని, విూరు దేశాన్ని 55 ఏళ్ల పాటు పాలించి నాశనం చేశారు.. మేం పేద ప్రజల్లో ఆశలు చిగురింప చేసి వారి సమస్యల నివారణ కోసం పని చేస్తున్నామన్నారు. పేదరికంపై ప్రజలు పోరాడి సాధికారత సాధించేలా చేశామని, సీబీఐ వంటి వ్యవస్థలను ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తున్నారన్నారు. ఎందుకంటే తాము అధికారంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ తమ అవినీతి ఖజానాకు ఏటీఎంలా వినియోగించుకోవాలనుకుంటోందని మోదీ వ్యాఖ్యానించారు. ‘నాపై విమర్శలు చేసే పనిలో కాంగ్రెస్‌ నేతలు పోటీ పడుతున్నారని అన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మోదీ-మోదీ అంటూ నా నామ జపమే చేస్తున్నారని మోడీ మండిపడ్డారు. అవినీతికి పాల్పడడం… అవినీతికి పాల్పడేవారికి సాయం చేయడమే వారి అజెండా అని అన్నారు. నేనో విషయం చెప్పదలుచుకున్నానని, ఈ కాపలాదారుడు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాడని,  రైతులను కాంగ్రెస్‌ తమ ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందన్నారు. రైతు రుణమాఫీ అంటూ మభ్యపెడుతోందని, విూలో ఎవరికైనా రుణమాఫీ జరిగిందా అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల కోసం పథకాలు ప్రవేశపెట్టబోదని, రైతుల సమస్యలు పరిష్కరించాలనే ఆలోచిస్తుందన్నారు. మా ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందని, బడ్జెట్‌లో రైతులు, పేదల కోసం బడ్జెట్‌లో పలు పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ కాపలాదారుడు విూ కోసమే పనిచేస్తాడని, ఎందుకంటే విూరు సమర్థమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. అవినీతి పార్టీలు, నేతలు కలిసి భాజపాను ఓడించాలని కలుస్తున్నాయని, విూరు ఆ ప్రతికూల శక్తులను ఓడించాల్సి ఉంచాలని మోదీ పిలుపునిచ్చారు.