అష్ట కష్టాల్లో కాలనీవాసులు
( జనం సాక్షి ) : మండల కేంద్రంలోని ముత్యంపేట్ జవహర్ నగర్ కాలనీవాసులు గత ఐదు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి కాలనీవాసులు అష్ట కష్టాలు పడుతున్నారు ఊరిలోకి వెళ్లడానికి రెండు మార్గాలు ఉన్నప్పటికీ రెండు మార్గాలలో వంతెన లేకపోవడంతో రెండు రోజులుగా వాగులు పారడంతో కాలనీవాసులు నిత్యవసర సరుకులకు ఆరోగ్య కేంద్రానికి వెళ్లడానికి వీల్లేకుండా ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వంతెన లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మించాలని ముత్యంపేట్ జవహర్ నగర్ కాలనీవాసులు కోరుతున్నారు గత సంవత్సరం ఇద్దరు మహిళలు వాగులో చిక్కుకున్నారని స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డారని కాలనీవాసులు తెలిపారు