అహ్మదాబాద్ టెస్ట్‌లో భారత్ ఘన విజయం
అహ్మదాబాద్ : అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న క్రికెట్ టెస్ట్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 406 పరుగులకు ఆలౌటైంది. 77 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సునాయసంగా లక్ష్యాన్ని చేరుకోగలిగింది. 9 వికెట్లు పడగొట్టిన ప్రజ్ఞాన్‌ఓజా మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇది 20వ విజయం.