అహ్మద్‌నగర్‌ ఆస్తత్రిలో ఘోర అగ్నిప్రమాదం


కోవిడ్‌ వార్డులో అగ్నికి పదిమంది పేషెంట్ల దుర్మరణం
విచారణకు ఆదేశించిన మహాప్రభుత్వం
ముంబై,నవంబర్‌6(జనంసాక్షి) : మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా దవాఖానలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దవాఖానలోని ఐసీయూలో మంటలు చెలరేగడంతో పదిమంది కరోనా రోగులు సజీవదహన మయ్యారు. మరో 11 మంది రోగులు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో జిల్లా దవాఖానలోని ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో చికిత్స పొందుతున్న 17 మందిలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. అయితే గాయపడిన 11 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వారిని మరో దవాఖానకు తరలించామన్నారు. సివిల్‌ ఆసుపత్రిలో ఐసియు వార్డులో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో పదిమంది మృతి చెందారు. మరో రోగికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఆసుపత్రిలోని కోవిడ్‌ ` 19 వార్డులో 17 మంది రోగులు చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ రాజేంద్ర భోంస్లే విూడియాతో మాట్లాడుతూ.. ’కోవిడ్‌ వార్డులో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగాయని అగ్నిమాపక విభాగం తెలిపింది. ఈ వార్డులో చికిత్స పొందుతున్న 10 మంది కోవిడ్‌ రోగులు మృతి చెందారు. మిగిలిన రోగులను చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రిలోని కోవిడ్‌ వార్డుకు తరలించాము. ఈ ఘటనపై ్గªర్‌ ఆడిట్‌ నిర్వహిస్తాము’ అని ఆయన అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని.. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని ట్వీట్‌ చేశారు. ఇక ఈ ఘటనపై సివిల్‌ ఆసుపత్రి ఇచ్చిన నివేదికను పరిశీలించి.. సమగ్ర విచారణ జరుపుతామని ఆ రాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ వెల్లడిరచారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులను ’ఫైర్‌ ఆడిట్‌’ చేయమని కోరామని పేర్కొన్నారు.