ఆంధ్రాలో మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటన

` గుంటూరు జిల్లాలో అరటితోటలపై స్టడీటూర్‌
` సేంద్రియ పంటలకు అంతర్జాతీయ డిమాండ్‌
తెనాలి(జనంసాక్షి):గురువారం గుంటూరు జిల్లా తెనాలి సవిూపంలోని కొల్లిపరలో అరటిసాగును తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి పరిశీలించి, తెనాలి వ్యవసాయ మార్కెట్‌ లో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్‌ పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ సేంద్రియ పంటలకు అంతర్జాతీయ డిమాండ్‌ ఉంది.సేంద్రీయ ఎరువులతో పండిరచిన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధరసేంద్రీయ వ్యవసాయం విూద రైతాంగం దృష్టి సారించాలిదేశంలోని 5,6 రాష్ట్రాలలోనే అన్ని రకాల పంటలు పండుతాయిఆయా రాష్ట్రాలలో పంటల సాగు పద్దతులు, రైతులు, శాస్త్రవేత్తల, అధికారుల అనుభవాలను తీసుకుని మా రాష్ట్రానికి అవసరం వచ్చేలా ఉపయోగించుకోవాలన్నది మా తాపత్రయం.తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో వినూత్న విధానాలతో వ్యవసాయాన్ని బలోపేతం చేశాం.మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నాం.ఏపీలోనూ వ్యవసాయానికి ఇక్కడి పరిస్థితుల మేరకు సాయం అందుతున్నది.పంటల దిగుబడి పెరగాలి, రాష్ట్ర ఆదాయం పెరగాలి.అంతిమంగా రైతుకు ఆదాయం రావాలి అన్నది లక్ష్యం.కొల్లిపర, తెనాలి ప్రాంతాల్లో మొదటి నుంచి అరటిపంటలు ఉన్నాయి.తెలంగాణలో ఇటీవల అరటిసాగు ఏటేటా పెరుగుతున్నది.రైతులు విత్తనాలు వేసుకోవడానికి ముందే అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లలో పరీక్షలు చేయడం అభినందనీయం.ఇది రైతాంగానికి ఎంతో మేలు చేస్తుంది.తెలంగాణలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.