ఆగస్టు 1న ఆటో హారన్ బహిరంగ సభ
వరంగల్,జూలై17(జనం సాక్షి): ఆగస్టు 1న హన్మకొండలోని ఏనుగలగడ్డ జయశంకర్ ప్రాంగణంలో ఆటో హారన్ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో యూనియన్ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఈసంపెల్లి సంజీవులు అన్నారు. దీనిని విజయవంతం చేయాలని అన్నారు. ఈ మేరకు బహిరంగ సభ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఆటో డ్రైవర్లకు కార్పొరేషన్ ఏర్పాటు, ప్రతి ఆటో రిక్షాకు పూర్తి బీమాను ప్రభుత్వమే భరించాలన్నారు. అర్హులైన ప్రతి డ్రైవర్‌కు రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని వర్తింప చేయాలని కోరారు. 12 డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలంటూ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.