ఆగివున్న స్కూల్ బస్సు ను ఢీకొన్న లారీ…
వరంగల్: పరకాల బస్టాండు వద్ద ఆగి ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును వెనుకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.