ఆటోల కనీస చార్జీలు పెంచకపోతే అగస్టు నుంచి సమ్మె
హైదరాబాద్: ఆటోల కనీస చార్జీలు పెంచకపోయినట్లయితే అగస్టు నుంచి సమ్మెకు దిగుతామని ఆటో సంఘాల స్పష్టం చేసింది. చలాన్ల రద్దు ఇతర డిమాండ్లపై రవాణాశాఖ కమిషనర్‌కు నోటిస్ అందజేశారు. ప్రస్తుతం ఉన్న 14 రూపాయల కనీస చార్జీని 20రూ. పెంచి, ఆపై కిలోమీటరుకు 11 రూపాయలుగా నిర్ణయించాలని ఆటో సంఘాల నేతలు డిమాండ్ వ్యక్తం చేశారు.