ఆటో ట్రాక్టర్ ఢీకొని డ్రైవర్ మృతి
కూసుమంచి : మండలంలోని కిసిరాజుటూడెం శివారు వాల్యాతండా వద్ద ప్రయాణికులతో వెళ్లున్న ఆటోను ట్రాక్టరు ఢీకొట్టింది ఈప్రమాదంలో వరంటల్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమల్లసంకీస గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బత్తుల బాబు 33 అక్కడికక్కడే మృతి చెందాడు అటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి స్థానికులు తెలిపారు వివరాల ప్రకారం పెరుమళ్లసంకీస గ్రామానికి చెందిన డ్రైవర్ బాబు తన ఆటోతో స్వగ్రామానికి వెళ్తూ మార్గమధ్యంలో గ్రానైట్ తో వెళ్లున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాంది దీంతో డ్రైవర్ బాబుఆటోలో ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు గాయాపడిన ప్రయాణికుల్లో ఎంపీటీసీ మాజీ సభ్యుడు సోమనబోచిన శ్రీనివాస్‌ను ఖమ్మంలోని ప్రయివేటు ఆస్పుత్రికి తరలించారు మరో ప్రయాణికుడి వివారాలు తెలియలేదు గ్రామీణం ఠాణా ఎస్‌ఐ నాగారాజు సంఘటన ప్రదేశాన్ని పరిశీలించా కేసు నమోదు చేశారు.