ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణం: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం కేసులు పెట్టి అణచివేయాలని చూస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. మిలియన్ మార్చ్‌కు సంబంధించి నమోదైన ఓ కేసులో హాజరయ్యేందుకు ఆయన నాంపల్లి కోర్టుకు వచ్చారు. తెలంగాణ యువత ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన ఆరోపించారు.