ఆత్మీయ మిత్రునికి ఆత్మ శాంతి చేకూరాలని ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం పంపిణీ.
8వ వార్డు కౌన్సిలర్ వెంకన్న గౌడ్ .శివశంకర్.
తాండూరు ఆగస్టు 18 (జనం సాక్షి)పట్టణ
టిఆర్ఎస్ యువకులు సంఘ సేవకుడు కీర్తిశేషులు విట్టల్ రావు సుగంధి జన్మదినోత్సవ సందర్భంగా తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఆయన కుటుంబ సభ్యులు రోహిత్ సుగంధి ఆధ్వర్యంలో గురువారం ఆసుపత్రి రోగులకు సిబ్బందికి అల్పాహారం వితరణ చేశారు. ఈ సందర్భంగా 8వ వార్డు కౌన్సిలర్ వెంకన్న గౌడ్ శివశంకర్ జావిద్ తదితరులు మాట్లాడుతూ విట్టల్ రావు అనేక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ సమాజంలో జరిగే సేవా సంస్థలలో మరియు ఎల్ఐసి సంస్థల్లో జరిగే పలు సేవా కార్యక్రమంలో పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా నిలిచేవాడని అన్నారు. ఆత్మీయ మిత్రుడు విట్టల్ రావు లేని లోటు స్పష్టంగా తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఆయన ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలిగే విధంగా సేవా కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్విరామంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు కాలనీ పెద్దలు యువ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.