ఆత్మ రక్షణ కు కరాటే విద్య ఎంతో అవసరం.
– ప్రతి ఒక్కరు కరాటే విద్యను విధిగా నేర్చుకోవాలి.
– సిద్దిపేట జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్.
దుబ్బాక 30, జూలై ( జనం సాక్షి )
మహిళలకు ఆత్మ రక్షణ విద్య కరాటే ఎంతో దోహదపడుతుందని అందుకు ప్రతి మహిళ కరాటే ను నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను కలిశారు. కలిసిన అనంతరం కరాటే శిక్షణ తరగతుల గురించి కలెక్టర్ తో చర్చించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు ప్రతి మహిళకు ఆత్మ రక్షణ విద్య కరాటే ఎంతో అవసరమని ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యాయత్నలను ఎదుర్కొనేందుకు ఎంతో ఉపయోగపడుతుంది, అంతేకాకుండా ఆత్మ రక్షణ విద్య అనేది మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.అదేవిధంగా మారుమూల గ్రామం దుబ్బాక మండలంలోని ధర్మాజీపేట గ్రామం నుండి వచ్చి సిద్దిపేట జిల్లాలో ఉచితముగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కరాటే శిక్షణ తరగతులను ఉచితంగా ఇస్తున్నందుకు మాస్టర్ బురాని శ్రీకాంత్ ను జిల్లా కలెక్టర్ అభినందించారు.




