ఆదివాసి గ్రామాల్లో సంబురాలు.

ఆదివాసి గ్రామాల్లో సంబురాలు.
జనం సాక్షి ఉట్నూర్.
భారతదేశంలో మొట్టమొదటి ఆదివాసి గిరిజన మహిళ రాష్ట్రపతి గా ఎన్నిక చేసిన సందర్భంగా నార్నూర్ మండల కేంద్రంలోని ఎంపల్లి జైతుకూడా గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులతో కలిసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందుర్ దాది రావు మాట్లాడుతూ ఆదివాసి గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి సమస్త ఆదివాసులు అండగా ఉంటూ ధన్యవాదాలు తెలిపారు. పాఠశాలలో పిల్లలకు మిఠాయి పంచి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు జాదవ్ విజయ్ సింగ్ మహిళలు పెందూర్ దేవ్ బాయి పెందూర్ మొత్తుబాయి కుమ్రం దర్య బాయి పేందూరు మాణిక్ రావు పటేల్ రాంషావ్ సమస్త గ్రామ పెద్దలు ఉన్నారు.
 
Attachments area