ఆదివాసీల తెగల సంస్కృతిక ఆచార్య సాంప్రదాయాలను కాపాడుకోవాలి
గంగారం సెప్టెంబర్ 16 (జనం సాక్షి)
కొత్తల ( పెద్దల ) పండుగ
ఆదివాసీల సంస్కృతి-ఆచార -సాంప్రదాయాలు -ప్రకృతి కి అనుబంధముగానే జరుపుకునే పండుగ కొత్తల ( పెద్దల ) పండుగ అంటారు. ఉత్తర కార్తీ మొదటి పాదంలో ఈ నెల 14 ,15 బుధ ,గురువారం లలో ఆదివాసీలు ఆచార ,సాంప్రదాయములతో పండుగను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పోనుగొండ్ల గ్రామంలో ఉన్నటువంటి పగిడిద్దరాజు ఆలయంలో పూజారులు గ్రామ పెద్దలు కలిసి ఉదయాన్నే ఇంటిల్లిపాది లేచి ఇల్లు వాకిలి శుద్ధి చేసుకొని తలంటి స్నానాలు చేసుకొని ,గ్రామ దేవతల పెరమయ్య ( పూజారి ) డోలి వాయిద్యాలతో ఇంటింటికి తిరిగి సళ్ళ ,అంబలి జమ చేసుకొని ఊరి బయట తోరణాలతో గ్రామానికి నాలుగు దిక్కులు పాతి సళ్ల అంబలితో ఆరబోస్తారు. సాయంకాల సమయములో ఇంటి వేల్పులకు కొత్తగా పండిన ధాన్యాలు ,సారా ,కోడిపిల్ల ను బలి ఇచ్చి ఇంటిల్లిపాది సల్లంగ ఉండాలని మ్రొక్కుతారు. ఇంటిలో పెతర్లు ( పెద్దలు ) పండుగను కొత్తధాన్యాలు, పాలు ,చెక్కరతో పాయసం చేసుకొంటారు. ఇంటిలో పెద్దలు చనిపోయిన సందర్భంలో గాని ,నూతన వధూవరులను తమ వంశీకులుగా పూర్తి స్థాయిలో హక్కులు కల్పించే విధముగా తల్లి కోడిని ఇంటి ఈశాన్యము గదిలో నిసాని మొగరానికి మ్రొక్కుకొని ఆచార సాంప్రదాయం ప్రకారం ఇంటిలో ఎన్ని గుంబాలు అన్ని గుంబాల దగ్గర ఇప్ప సారా ఇప్ప ఆకు డోప్పలో పోసి పాయసం ఉంచుతారు. సారాయి ని ఆరబోసి కోడిని గుంబాలకు అటు ,ఇటు కొడుతూ ,వడ్డె సెలవు అడుగుతూ కోడిని చంపుతారు. కోడిని ముక్కలు వేసి విడివిడిగా పడి అన్నo వండి వడ్డె అనుమతి( సెలవు) తో వంశ సభ్యుల అందరికి వడ్డిస్తారు. శనార్తి (సెలవు) అనే పధముతో సెలవు అడిగి అందరు భోజనం చేస్తారు. ఇట్టి ఆచార సాంప్రదాయంగా వండిన ఆహారమును ఇతరులకు పెట్టరు.నూతనంగా పెళ్లి అయిన అమ్మాయి తన పుట్టింటి వారి గట్టు ,గోత్రాలను విడిచి తన భర్త యొక్క గొట్టు ,గోత్రాలలోకి మార్పిడి చెందుతుంది. అట్టి క్రమములో తన తల్లిగారి ,ఇంటి ఆచార-సాంప్రదాయ వ్యవహారాలు ఏవి కూడా చెల్లవు .మరునాడు ఉదయం పెద్దలు ,పెతర్ల పేరుతో అన్నదానం ,వస్తూ దానం సమర్పించి పెద్దల ( కొత్తల ) పండుగ ఐపోయినట్లుగా గ్రామ పెద్దలు పూజారులు వివరించారు ఈ కార్యక్రమంలో పగిడిద్ద రాజు ఆలయ ప్రధాన పూజారులు పెనుక బుచ్చి రాములు, సురేందర్, రాజేశ్వర్, సమ్మయ్య, వీరస్వామి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు