ఆదివాసీ గ్రామాల సమస్యలు పరిష్కరించాలి..
ఆదివాసీ సర్పంచ్ ల డిమాండ్…
బేల, ఆగస్టు 17 ( జనం సాక్షి ) : మండల కేంద్రము లోని కుంరాం బీమ్ కాంప్లెక్స్ లో బుధవారం మండల ఆదివాసీ సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ గ్రామ పంచాయతీ లకు నిధులు మంజూరు కావడం లేదని 90 రోజుల వరకు చెక్కు లు పాస్ కావడం లేదని పేర్కొన్నారు. ఆదివాసీ గ్రామాలలో విద్యుత్ విద్య, వైద్యం సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటిడిఎ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఆడే శంకర్, కొరంగే జంగషావ్, పెందుర్ శారదా, చందర్ షా , యశోద బాయి, బీంబాయి, జనార్దన్,మడావి గోవింద్ రావ్,నైతం సితారాం తదితరులు పాల్గొన్నారు..