ఆధ్యాత్మికంతో… మదినిండా ఆనందదాయకం.

భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమాలు.
తాండూరు అగస్టు 27(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం వాల్మీకి నగర్ లో వేలసిన, శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో శ్రావణ మాస అమావాస్య పురస్కరించుకొని ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి, రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ మహిళా మండలి వారి తో పారాయణ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా అయ్యప్ప స్వామి భజన మండలి, మరియు నగరేశ్వర భజన మండలి, సత్య సాయి భజన మండలి, వారితో భజన కార్యక్రమాలు వైభవంగా కనులపండువగా జరుపుకున్నారు.అనంతరం అమ్మవారికి మహా ఆరతి, కార్యక్రమం నిర్వహించి మహా ప్రసాదం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు, దర్మిది రవిశంకర్, కార్యదర్శి పూజారి పాండు, మరియు ఆలయ కమిటీ సభ్యులు, సతీష్ , సునీల్ , సంగ్రామాన్ని, నగేష్, వీరు, ఎం నాగరాజ్, నరహరి, గోపి యాదవ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.