ఆపదలో ఆదుకోవడం అభినందనీయం..! – ఎస్. ఐ బేతి రాములు

జనంసాక్షి, కమాన్ పూర్,అక్టోబర్ 06 : యువత ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అభినందనీయమని కమాన్ పూర్ ఎస్సై భేతి రాములు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన రాచకొండ ప్రేమ్ గత సంవత్సర కాలంగా బ్రెయిన్ క్యాన్సర్ తో పోరాడుతుండగా నిరుపేద కుటుంబానికి చెందిన ప్రేమ్ వైద్యం కోసం హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించే క్రమంలో సేవ్ ప్రేమ్ అంటూ కొంత మొత్తాన్నీ జమ చేసిన క్రమం లో , దురదృష్టవశాత్తు ప్రేమ్ మరణానంతరము ప్రేమ్ తల్లి,భార్య,సంవత్సరం కూడా నిండని బాబు ఇలా ఏ అండా లేక అప్పుల పాలు అయి ఉన్న వారి కుటుంబానికి అండగా నిలబడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులంతా కలిసి తమ సాయాన్ని ప్రేమ్ కి నివాళులు గా అందిస్తూ జమ చేసిన మొత్తం రూపాయలు 1,13,700/- ఎస్సై రాములు చేతుల మీదుగా ప్రేమ్ కుటుంబ సభ్యులకి అందచేయడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్సై రాములు మాట్లాడుతూ యువత ముందుకు వచ్చి మరిన్ని ప్రజా ఉపయోగకరమైన పనులు చేయాలని కోరారు.
హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నారగోని సతీష్ మాట్లాడుతూ.. ప్రేమ్ కుటుంబానికి అండగా ఆర్థిక సహయం అందించిన ప్రతీ హెల్పింగ్ హ్యాండ్ కి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. జమ అయిన మొత్తాన్ని ప్రేమ్ కుమారుడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది అని,విది వంచించిన ప్రేమ్ కుటుంబానికి మానవత్వాన్ని బ్రతికస్తూ వీలైనంత ఆర్థిక సాహయం వారి కుటుంబానికి అందించే దాతలు ముందుకు రావాలని, సాయం అందించే వారు 8332033669 నంబర్ కి ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా అందించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నారగోని సతీష్, సీనియర్ జర్నలిస్ట్ జబ్బర్ ఖాన్, మెడగోని విజయ్,రెడ్డి చైతన్య, గడ్డం ప్రకాష్, మల్యాల రమేష్,కొత్తపల్లి సతీష్, బుర్ర శ్రీనివాస్, వడ్లకొండ తిరుపతి,జంగిలి పోచాలు, జంగిలి కనకయ్య పాల్గొన్నారు.