ఆయిల్‌పామ్‌తో లాభాల పంట

ఆదిలాబాద్‌,మార్చి3(జనం సాక్షి): ఆయిల్‌పాం పంటలను సాగు చేస్తే రైతులు ఆర్థికంగా ఎదుగుతారని విప్‌ బాల్క సుమన్‌ తెలిపారు. ఈ ప్రాంతంలోని రైతులు ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి సారించాలని అన్నారు. వివిధ గ్రామాల్లో రోడ్లు, కల్వర్టుల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. గొల్లవాగు ప్రాజెక్టుకు అన్నారం బ్యారేజీ నుంచి లిప్ట్‌ ద్వారా నీటిని అందించి సాగునీటికి ఇబ్బందులు పడకుండా చూస్తామని అన్నారు. ఆయిల్‌ పామ్‌కు దేశంలో మంచి డిమాండ్‌ ఉందని,పెట్టుబడి కూడా తక్కువేనని అన్నారు. దీనిని గమనించి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ముందుకు సాగాలన్నారు.