ఆర్కేపి సిఎస్పీని పరిశీలించిన రైల్వే ప్రిన్సిపల్ ఈ.డీ.
రామకృష్ణాపుర్, (జనంసాక్షి): బొగ్గు రవాణాను వేగవంతం చేసేందుకు శనివారం ఆర్కేపి సిఎస్పీని రైల్వే ప్రిన్సిపల్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ ఎం.కే. శ్రీవాత్సవ్, మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ తో కలిసి సందర్శించారు. మెరిట్, జి.ఎల్. బంకర్స్, సిఎస్పీలో బొగ్గు రవాణా తదితర విషయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్కేపీ సిఎస్పీ రైలుమార్గం మనుషులతో లింక్ లేకుండా, ఎటువంటి ప్రమాధములు జరగకుండా, స్టేషన్ నుండి డైరెక్ట్ సిఏస్పీకి వచ్చే మార్గం చాలాసేఫ్ గా ఉంటుందని మందమర్రి జి.ఎం. వివరించారు.
ఈ కార్యక్రమంలో రైల్వే ఏ.ఓ. మోహన్ రాజ్, ఎస్ ఓ టు జి.ఎం. కృష్ణారావు , ఏ.జి.ఎం. ఎస్.వి. రామ్మూర్తి , రైల్వే డి.ఓ.ఎం. శ్రీకాంత్ , ఎస్ఎస్ రామారావు, కమర్షియల్ ఇన్సుపెక్టర్ ప్రశాంత్, సిఎస్పీ ఇంఛార్జి డి.జి.ఎం. బాలాజీ భగవతి ఝా, డి.వై.ఎస్.ఈ. ఏ. చంధ్రమౌళి, గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు మేడిపెల్లి సంపత్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికెల సంపత్, ఓ. రాజశేఖర్, ప్రాతినిధ్య సంఘం నాయకులు అక్భర్ అలి, ఇప్పకాయల లింగయ్య, పిట్ సెక్రటరీలు శంకర్రావు, సంజీవ్ నాయకులు సామల రాజమౌళి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.