ఆర్థిక ఒడిదుడుకులను చక్కదిద్దలేరా

ఇంకెన్నాళ్లీ సంక్షోభమో మోడీకే ఎరుక
న్యూఢిల్లీ,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): ఒక వైపు నోట్ల రద్దు, మరో వైపు జీఎస్టీ, దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన సందర్భంలో ప్రజలు ఇంకా దానినుంచి కోలుకోవడం లేదు. అయితే ఫలితాలు ముందున్నాయని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ పదేపదే ప్రజలను మభ్య పెడుతున్నారు. ఈ దశలో ఈ రెండు అంశాలపై ఇప్పటికే విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఒకప్పుడు ఆర్థిక వేత్తగా ఉన్న వ్యక్తే ప్రధానిగా ఉన్నా?ఆర్థిక వ్యవస్థకు మాత్రం అనారోగ్యం అంటూ మోడీ తనదైన శైలిలో మన్మోహన్‌ సింగ్‌పై విమర్శలు గుప్పించారు. కానీ మోడీ సర్కారు వచ్చాక తీసుకున్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలుచేశారని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.  ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాక కూడా ప్రభుత్వ తీరులో మార్పు రాలేదు. ఆయన తప్పుకోవడం ఓ రకంగా ఆర్థికంగా దేశం దెబ్బతినడమే కారణమా అన్న అనుమానాలు బలపడ్డాయి. పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు ఇంకా గాడినపడటం లేదు. గతేడాది డిసెంబర్‌లో 2.4 శాతానికే పరిమితమైంది. గనుల రంగంలో మందగించిన కార్యకలాపాలు, తయారీ రంగంలో కనిపించిన పేలవ ప్రదర్శన పారిశ్రామికోత్పత్తి సూచీ  పరుగులను అడ్డుకున్నాయి. 2017 డిసెంబర్‌లో ఐఐపీ వృద్ధిరేటు 7.3 శాతంగా ఉందని  కేంద్ర గణాంకాల కార్యాలయం తెలిపింది. ఇదిలావుంటే నిరుడు నవంబర్‌ ఐఐపీ వృద్ధిరేటును 0.3 శాతానికి సీఎస్‌వో సవరించింది. తొలుత 0.5 శాతంగా అంచనా వేసినప్పటికీ దీన్నిప్పుడు సవరిస్తున్నట్లు తాజాగా పేర్కొన్నది. ఇకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంఏప్రిల్‌-డిసెంబర్‌ వ్యవధిలో పారిక్షిశామికోత్పత్తి వృద్ధిరేటు 4.6 శాతంగా ఉందని సీఎస్‌వో ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 3.7 శాతంగా ఉన్నట్లు తెలియజేసింది. కాగా, ఐఐపీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం.. నిరుడు డిసెంబర్‌లో రికార్డు స్థాయి లో 2.7 శాతం వృద్ధితోనే సరిపెట్టిందని, అంతకుముందు ఏడాది డిసెంబర్‌లో .7 శాతం వృద్ధిని కనబరిచినట్లు సీఎస్‌వో పేర్కొన్నది. క్యాపిటల్‌ గూడ్స్‌ ఉత్పత్తి వృద్ధిరేటు 5.9 శాతంగానే నమోదైందని తెలిపింది. మొత్తంగా గతేడాది డిసెంబర్‌లో తయారీ రంగంలోని 23 పరిశ్రమల్లో 13 మాత్రమే వృద్ధిరేటును కనబరిచాయి. ‘ఐఐపీ గణాంకాలు ఊహించినట్లుగానే ఉన్నాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా మున్ముందు మరింత తగ్గవచ్చని అభిప్రాయపడ్డారు.