ఆర్.టీ.సి డిపోలో న్యాయ సలహాల పై అవగాహన

జహీరాబాద్ జులై 29 (జనంసాక్షి)
మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, జహీరాబాద్ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మెన్ డి.దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్.టీ.సి డిపోలో లీగల్ అవేర్నెస్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటారు వాహనాల చట్టం, నేషనల్ లోక్ అదాలత్, ఉచిత న్యాయ సేవా సహాయంపై వివరించారు. ఇతర ఏ న్యాయ పరమైన సమస్యలున్న స్థానిక మండల లీగల్ సర్వీసెస్ కార్యాలయం ను గాని లేదా ఆయా మండల కేంద్రాల్లో ఉన్న న్యాయ సేవా సహాయ కేంద్రాలను కానీ సంప్రదించి న్యాయ సహాయం పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు గోపాల్, మానెన్న, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, డిపో మేనేజర్ రజినీ కృష్ణ,ఆర్.టీ.సి సిబ్బంది పాల్గొన్నారు.