ఆవిర్భావ సభ కీలక నిర్ణయాలకు వేదికకానుంది: ఈటెల
ఆర్మూర్, జనంసాక్షి: తెలంగాణను యాచించి కాదు, సాధించి తెచ్చుకుంటామని తెరాస నేత ఈటెల రాజేందర్ అన్నారు. తెరాస ఆవిర్బావ సభ కీలక నిర్ణయాలకు వేదిక కానుందని ఆయన తెలిపారు. చట్టసభల్లో మహిళలకు బీసీలకు రిజర్వేషన్లు అంశంపై ఈ సభలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.