ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఐటీడీఏ పిఓ
గుడిహత్నూర్,: జులై 19( జనం సాక్షి) మండలంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల (బాలికలు ) ఉమ్రి జి, (బాలురు )తోషం బుధవారం ఉట్నూర్ ఐటీడీఏ పిఓ వరుణ్ రెడ్డి తనిఖీ చేసారు.పిల్లలనీ ఆంగ్లబోదనం ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. మరియు విద్యార్థులకు ఆటలు సంగీతం బొమ్మలు వివిధ రకాల కళా వృత్తులను భోదించాలన్నారు. వసతి గృహలలో పిల్లలకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని సమయానుసారంగా మెనూ ప్రకారంగా అందించాలని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని,
విద్యార్థుల హాజరు శాతాన్ని వారం రోజు లో పెరిగేలా చూడాలని మరియు విద్యార్థులకు మేను ప్రకారం భోజనం పెట్టాలి వర్షాకాలం కాబట్టి అలంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త వహించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు మరియు సమయపాలన పాటించాలని సూచించారు. అంతకుముందు గుడిహత్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తనిఖీ చేశారు ఆరోగ్య కేంద్రంలోని రికార్డులు, రిజిష్టర్లను పరిశీలించారు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు పిఓ వెంట మెడికల్ ఆఫీసర్ నిలోఫర్, హెల్త్ సూపర్ వైజర్ అన్నపూర్ణ, ల్యాబ్ టెక్నీషియన్ జీవన్, ఆయా పాఠశాలలహెచ్ ఎం లు ఉన్నారు
2 Attachments