ఆసరాగా నిలుస్తోన్న పోషణ్‌ అభియాన్‌

అబాలలు, గర్భిణీలకు వరంగా కేంద్ర పథకం

పైలట్‌ ప్రాజెక్టుగా భూపాలపల్లి జిల్లా ఎంపిక

వరంగల్‌,జూలై13(జ‌నం సాక్షి): పోషకాహార లోపంతో అనారోగ్య బారిన పడుతున్న శిశువులు .. గర్బిణీలు. బాలింతలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ్‌ అభియాన్‌ వారికి అదనపు పోషకాహారాన్ని ఇచ్చి వారిని ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషి చేస్తుంది. జిల్లా వైశాల్యంతో పెద్దది కావడం, ఎక్కువ అటవీ ప్రాంతం కావడంలో భూపాల్పల్లి జిల్లాలో కార్యక్రమాన్ని ప్రత్యేక శ్రద్దతో కొనసాగిస్తున్నారు. వ్యవసాయం .. కూలి … నాలి చేసుకునేవారు ఇక్కడ ఎక్కువ.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల అభివృద్దికి ఎంచుకున్న జిల్లలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఒకటి.. ప్రతి ఒక్కకరికిని సంక్షేమ పధకాలలో బాగాస్వములను చేయాలనే ఉద్దేశ్యంతో కేంద్రం ఆలోచనతో జిల్లా సంక్షేమ పధకాల అమలు లో పరుగులు పెడుతుంది. కేంద్రం ప్రజా సంక్షేమం కోసం అనేక పధకాలు తీసుకుంది… అందులో శిశువులు… గర్భిణీలు. బాలింతలకు అదనపు పోషకాహారం అందించే లక్ష్యం తో ఏర్పాటు చేసిన పధకమే పోషణ్‌ అభియాన్‌… మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న ఈ పధకం జయశంకర్‌ భూపాల పల్లి జిల్లలోని అంగన్వాడి కేంద్రాల్లో తమ పేరు నమోదు చేయించుకున్న వారికి ఆరోగ్య వరప్రదాయినిగా మారింది. 6 ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ల ద్వారా జయశంకర్‌ భుపాలపల్లి జిల్లాలో 1284 అంగన్వాడి సెంటర్ల ద్వారా లాబోక్తలకు పలురకాల సేవలు అందిస్తుంది. అంగనువాడి సెంటర్లలో పిల్లలకు అదనపు పోషకాహారంతో పాటు చక్కటి అటపాటలతో కూడిన పూర్వ ప్రాధమిక విద్యను అందించడం కాకుండా పిల్లలకు కాగిదపు బొమ్మలు.. మట్టి తో చేసిన వస్తువులను వారితో తాయారు చేయించి …. అందులో ప్రతిభ కనపరిచిన వారికీ ప్రధమ… ద్వితీయ.. అని శ్రేణిలు ఏర్పాటు చేసి వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు అంగన్‌వాడి కేంద్రాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. పిల్లలను .. గర్భిణీలను… బాలింతలను సెంటర్లో నమోదు చేసుకుని ఎప్పటికప్పుడు వారి బరువును చూసి వారికి కావలిసిన పోషకాహారం కావలసిన మోతాదులో ఇవ్వడం జరుగుతుంది.. పిల్లలు ప్రతి రోజు పోషకాహారంలో అన్నం, ఆకుకూర పప్పు రోజుకు ఒక కోడి గుడ్డు అందిస్తూ ఇంకా లోప పోషణ ఉన్న పిల్లలు ఉంటె వారికి 100 ఎంఎల్‌ పాలను అదనంగా అందించడంతో పాటు బాలమృతంను అందిస్తున్నారు. ఇందుకు గాను ఐసిడిఎస్‌ అధికారులు ఎప్పటి కప్పుడు అంగన్వాడి కేంద్రాలను పర్యవేక్షించి నమోదు చేయించుకున్న లబ్దిదారులకు పోషణ్‌ అభియాన్‌ ద్వారా పోషకాహారం అందెల చర్యలు చేపడుతుండగా,లాభోక్తులు తమకు రోజు పోషకాహారం లభిచడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

—————————