ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ ఆగస్టు 28( జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్ గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా మంజూరు అయిన ఆసరా పెన్షన్  లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే  మాణిక్ రావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్ళు నిండిన వారికి టీ.ఆర్.ఎస్ సర్కారు పింఛన్లు మంజూరు చేసిందని 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా 57 ఏళ్ళు పై బడిన వారికి పెన్షన్లు అందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభ వార్త చెప్పారన్నారు.
పేద కుటుంబాలకు అండగా నిలవాలని ఆసరా పింఛన్ల అర్హతకు వయో పరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ పెంట రెడ్డీ, పట్టణ అద్యక్షులు సయ్యద్ మోహివుద్దిన్, మాజీ చైర్మన్లు మాంకల్ సుభాష్, తంజిం, పట్టణ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లు రాజేందర్, బిషప్ప, నాయకులు ఇజ్రాయేల్ బాబీ, హంజా, అక్రమ్, ముర్తుజా, ఏషప్, దీపక్ రాజ్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.