ఆస్పత్రిలో దుండగుడి కాల్పులు

 

నలుగురు మృతి

షికాగో,నవంబర్‌20(జ‌నంసాక్షి):అమెరికాలోని షికాగోలో కాల్పుల కలకలం రేగింది. మెర్సీ ఆస్పత్రిలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఓ పోలీస్‌ అధికారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. కాల్పుల ఘటనతో ఆస్పత్రిలోని సిబ్బంది, రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భద్రతా సిబ్బంది ఆస్పత్రిలో ఉన్న వారిని సురక్షితంగా బయటకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.