*ఇంకా ఈ కేవైసీ చేసుకొని రైతులకు మరో అవకాశం*
*—బిజెపి మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి*
దోమ న్యూస్ జనం సాక్షి.
దోమ న్యూస్ జనం సాక్షి.
ఇంకా ఈ కేవైసీ చేసుకొని రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించిందని బిజెపి మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2019 నాటికి పట్టాదారు పాసుబుక్కు వచ్చి ఉండి పిఎం కిసాన్ డబ్బులు పడుతున్న వారందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని 15-08-2022 చివరి తేదీ నాటికి అందరు రైతులు ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోవాలని అన్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లో, అందుబాటులో ఉన్న మీ సేవలో ఈ కేవైసీ అప్డేట్ చేసుకునే అవకాశం ఉందని, చేసుకున్న వారికి పీఎం కిసాన్ 12వ విడతగా డబ్బులు నేరగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని బిజెపి మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.




