ఇంకా దొరకని శ్రియ ఆచూకి

మహబుబ్‌నగర్‌: పాలమూరు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన ఆరేళ్ల చిన్నారి శ్రియ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో ఉంటున్న నాగరాజు-రజిత దంపతులు నిన్న ఉదయం విధులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఆగుకుంటున్న శ్రియను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. కాగా కిడ్నాప్‌ వ్యవహారంలో పలు అనూమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తమకు ఎవరూ శత్రువులు లేరని తమ కూతురుని క్షేమంగా విడిచిపెట్టాల్సిందిగా శ్రియ తల్లిదండ్రులు కోరుతున్నారు.