ఇంకెన్నాళ్లు ఈ నిరీక్షణ
జనం సాక్షి కథలాపూర్
కథలాపూర్ , మేడిపల్లి మండలాల వరప్రదాయని నలభై వేల ఎకరాల సాగు కొరకు ప్రజలు ఇంకెన్నాళ్లు వేచి చూస్తారని ఈ నిరీక్షణ తగదా అని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు అన్నారు, అనంతరం మండలంలోని తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో నాగరాజు మాట్లాడుతూ సూరమ్మ ప్రాజెక్టు, కుడి ఎడమ కాలువలు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు 2008లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి అప్పటినుండి ఇప్పటివరకు జానెడు పని కూడా చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు ఎలక్షన్లలో ఉన్న శుద్ధి ప్రజల పైన లేదని అన్నారు రానున్న కాలంలో ప్రజల నాయకుడు వచ్చి మా బాధలు తీర్చుతారని వేచి చూస్తున్నామని జ్యోతిష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అజీమ్, లింగం గౌడ్, ఉప సర్పంచ్ నర్సిరెడ్డి, శంకర్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు