ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో 5,51,169మంది ఉత్తీర్ణత

హైదరాబాద్‌, జనంసాక్షి: ద్వితీయ సంవత్సర ఫలితాల్లో మొత్తం 9,24,830 మంది విద్యార్థులు హాజరవగా 5,51,169 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెగ్యులర్‌ విద్యార్థులు 65.36 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రైవేట్‌ విద్యార్థులు 30.50 శాతం, ఒకేషనల్‌ విద్యార్థులు 48.60 శాతం ఉత్తీర్ణత సాధించారు.