ఇంటర్‌ విద్యార్థి మనస్థాపంతో మూడు రోజులుగా ఆచుకిలేకపోయింది

ఎల్లారెడ్డిపేట: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలో తప్పానని మనస్థాపంతో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. కరీంనగర్‌ జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డి పేటకు చెందిన మంగళహారతుల రాకేశ్‌ మూడు రోజులుగా కనిపించడం లేదు. ఇంటర్‌ ఫలితాలు చూసుకోవడానికి బయటకు వెళ్లిన అతను ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబీకులు వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు లింగవ్వ, బాలలింగం ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.