ఇంటర్ 54.6శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు
హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను మంత్రి పార్థసారథి విడుదల చేశారు. 54.6శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. గతేడాదితో పోలిస్తే 0.85శాతం ఉత్తీర్ణత పెరిగిందని చెప్పారు. జనరల్ కేటగిరీలో 8,91,337 మంది పరీక్ష రాయగా 4,86,658 మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ కోర్సులో 46,54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.