ఇంటింటా ఇన్నోవేటర్ అవిష్కర్తలకు చక్కటి వేదిక… జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్,

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :
సమాజంలోని సమస్యలకు వినూత్న సరిష్కారాలతో అవిష్కర్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. శనివారం రోజున తన క్యాంపు కార్యాలయంలో ఇంటింటా ఇన్నోవేటర్ పోస్టర్స్ లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో సామాజిక సమస్యలకు వినూత్నమైన పరిష్కారాల కొరకు ఆవిష్కరించే వేదికనే ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శనలు అని అన్నారు. విద్యార్థులతో మొదలుకొని ఉపాధ్యాయులు, రైతులు, యువకులు, ఐటీ నిపుణులు, గృహిణులు, పరిశోధకులు, విభిన్న వర్గాల వారు, తాము కనుగొన్న వినూత్న ఆవిష్కరణలను 9100678543 వాట్సాప్ నెంబర్ కు ఆగస్ట్ 5 లోపు పూర్తి వివరాలతో పంపించాలని తెలిపారు. ఆయా ఆవిష్కరణలను పరిశీలించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్న వాటిని గుర్తించి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంలో ప్రశంసా పత్రాలతో ఆవిష్కర్తలను అభినందించడం జరుగుతుందని తెలిపారు. ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలను ఆరు వాక్యాలు, రెండు నిమిషాల వీడియోను, ఆవిష్కరణ యొక్క నాలుగు ఫోటోలు, ఆవిష్కర పేరు, ఫోన్ నెంటర్, వయసు, ప్రస్తుత వృత్తి, గ్రామం. పేరు, జిల్లా పేరు, తదితర వివరాలను జిల్లా సైన్స్ అధికారికి లేదా 9100678543 మొబైల్ వాట్సాప్ నెంబర్ కు పంపించాలని తెలిపారు. ఇన్నోవేటర్స్ నుండి దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ 5 ఆగస్ట్ 2022 అని తెలిపారు. సకాలంలో అందిన దరఖాస్తుల నుండి మొదటి షార్ట్ లిస్ట్, తరువాత ప్రతీ జిల్లా నుంచి ఐదు ఆవిష్కరణలు ప్రదర్శనకు ఎంపికచేయబడుతాయని తెలిపారు. మరిన్ని ఇతర వివరాలకు జిల్లా సైన్స్ అధికారి . రఘురమణ (సెల్ నెంబర్ 9440060288) సంప్రదించాలని తెలిపారు. ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి అన్ని రంగాల, వర్గాల ఆవిష్కర్తలు పాల్గొన వచ్చని తెలిపారు. గ్రామీణ, విద్యార్ధుల, చిన్న తరహా పరిశ్రమల ఆవిష్కరణలతో పాటు, సృజనాత్మకమైన ఆవిష్కరణలు అంగీకరించ బడతాయని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ వర్గాల వారు ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని కొత్త కొత్త ఆవిష్కరణలతో సమస్యలకు పరిష్కారాలతో ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిపిఅర్ వో.ఎన్. భీమ్ కుమార్, జిల్లా మేనేజర్ బండి రవి, డీఈఓ ప్రణీత, జిల్లా సైన్స్ అధికారి కె. రఘురమణ, ASO మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.