ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

ముగ్గురు చిన్నారులకు గాయాలు
హైదరాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి):  బంజారాహిల్స్‌లోని రోడ్‌నంబర్‌ -12లో ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌ నుంచి మాసబ్‌ ట్యాంక్‌ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోవడంతో డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పింది. గాయపడిన చిన్నారులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.