ఇండియన్‌ ఒలంపిక్‌ ఆసోషియేషన్‌పై వేటు

ఢిల్లీ: ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ జోక్యాన్ని సహించని అంతర్జాతీయ ఒలంపిక్‌ కమిటీ (ఐఓసీ ), ఇండియన్‌ ఒలంపిక్‌ అసోషియేషన్‌  (ఐఓఏ )పై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఐఓసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ లాంఛనంగా ప్రకటించారు.న్యూఢిల్లీలో ఐఓఎ అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌ మల్హోత్రా ఈ పరిణామంపై మాట్లాడుతూ సస్పైన్షన్‌పై తమకెలాంటి సమాచారమూ అందలేదన్నారు. ఐఓఎ ఎన్నికలపై క్రీడా నింధనలను రుద్దవద్దని ప్రభుత్వానికి రెండేళ్లుగా విన్నవించిన ఫలితం లేకపోయిందన్నారు. ప్రభుత్వం, ఐఓసీ, ఐఓఏ కూర్చుని సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నారు. కాగా, హైకోర్టు ఆదేశాల మేరకే క్రీడా విధానం కింద ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. సస్పెన్షన్‌ వేటు పడితే ఐఓఏకి, ఐఓసీ నిధులు అందవు. ఒలంపిక్‌ సమావేశాలు కార్యక్రమాల్లో ఐఒసీ అధికారులు పాల్గొని అవకాశముండదు. ఇక భారత అథెట్లు వారి జాతీయ పతాకంతో గాక ఒలంపిక్‌ పతాకంతో మాత్రమే ఒలంపిక్‌ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఐఓఏ తన స్వంత రాజ్యాంగాన్ని, ఒలంపిక్‌ ఛార్టర్‌ను మాత్రమే అనుసరించాలి తప్ప ప్రభుత్వ క్రీడాల నిబంధనలను కాదని ఐఓసీ పదే పదే తెలిపింది. ప్రభుత్వ నిబంధనలకింద ఐఓఏ ఎన్నికలు జరిగితే ఈ ఫలితాలను ఐఓసీ గుర్తించదు. ఐఓఎకు 16ఏళ్లపాటు నేతృత్వం వహించిన సురేష్‌ కల్మాడీ 2010లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడలకు సంబంధించిన అవినీతి ఆరోపణలపై తొమ్మిది నెలల కారగారవాసం అనుభవించారు. ఇక తిరిగి ఐఓఏ ఎన్నికల్లో పాల్గొనరాదని నిర్ణయించుకున్నారు.  గత నెలలో ఐఓఏ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్‌ ఛైర్మన్‌ ఎస్‌ వై ఖురేష్‌ రాజీనామాతో బుధవారానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక ఎన్నికల్లో పోటీ పెట్టని కొన్ని పదవులకు సంబంధించి శుక్రవారం రోజున కొందరు అధికారుల నియామకాన్ని ఐఓఏ ప్రకటించింది. వీరిలో కామన్వెల్త్‌ క్రీడలకు సంబంధించి అవినీతి ఆరోపణలకు గురైన లలిత్‌ భానోత్‌ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అభే సింగ్‌ చౌతాలా కూడా ఎలాంటి పోటీ లేకుండా పదవిని దక్కించుకున్నారు.