ఇండోనేషియాలో కుప్పకూలిన ప్రైవేట్ చాప్టర్ విమానం
ఇండోనేషియా(జనం సాక్షి ):ఇండోనేషియాలోని తూర్పు పర్వత ప్రాంతంలో ప్రైవేట్ చాప్టర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. 12 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. శనివారం తనాహ్ మేరా ప్రాంతం నుంచి బయలు దేరిన ఈ ప్రైవేట్ విమానం గమ్యస్థానం ఓక్సిబిల్ చేరుకునేలోగా ఈ ప్రమాదం జరిగింది. న్యూ పపువా గినియా సరిహద్దుల్లో ఆదివారం ఉదయం విమాన శకలాలను గుర్తిం చారు స్థానికులు. ఇద్దరు విమాన సిబ్బందితో కలిపి మొత్తం 9 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 12 ఏళ్ల బాలుడు ఒక్కడే సురక్షితంగా ఉన్నాడు. ప్రమాదానికి గల కారణాలు తెలిసిరాలేదు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని… దర్యాప్తు చేపట్టామని తెలిపారు అధికారులు.