ఇకనేను పేదలకోసం పనిచేస్తా..
` నన్ను చూసి గర్వించేలా పనిచేస్తా..
` ఎన్‌సీబీ కౌన్సిలింగ్‌లో ఆర్యన్ ఖాన్ హామీ
ముంబయి,అక్టోబరు 17(జనంసాక్షి): విడుదల అయిన తర్వాత పేదల సంక్షేమానికి కృషి చేస్తానని.. తనకు చెడ్డపేరు తెచ్చే పనులు చేయబోనని, చెడు మార్గంలో వెళ్లనని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ శనివారం ఎన్‌సీబీ అధికారులకు హావిూ ఇచ్చాడు. ఈనెల 2న ఓ క్రూయిజ్ నౌకలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న కేసులో ఆర్యన్‌ను ఎన్‌సీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ముంబయిలోని ఓ జైలులో అధికారులు అతనికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యన్ వివిధ అంశాలపై మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. ‘‘పేదలు, అణగారిన వర్గాల ప్రజలకుచేయూతనిస్తా.. నన్ను చూసి గర్వపడేలా చేస్తా’’ అని అధికారులకు చెప్పాడు. కాగా అతని బెయిల్ వ్యాజ్యంపై ప్రత్యేక కోర్టు ఈనెల 20న ఆదేశాలు ఇవ్వనుంది.